తన సోదరుడి మరణంపై భోరుమన్న ఎన్టీఆర్…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
82
ఇటీవల వరుసగా విషాద సంఘటనలు నందమూరి ఫ్యామిలీని కుంగతీస్తున్నాయి అనే చెప్పాలి. ఇటీవల దివంగత ఎన్టీఆర్ గారి తనయుడు మరియు జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ ఘోర రోడ్ ప్రమాదంలో  మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు దేశవ్యాప్తంగా వున్న నందమూరి అభిమానులందరూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఆ విషాద ఘటన తరువాత వారి కుటుంబానికి కొంత ఆసరానిచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ అక్క, నందమూరి సుహాసిని గారికి టీడీపీ తరపున కూకట్పల్లి నియోజకవర్గం సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సుహాసిని ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. అయితే ఈ వార్తతో నందమూరి ఫ్యామిలీ కొంత ఆవేదనకు గురయింది. ఇక నేడు వారి ఇంట సంభవించిన మరొక విషాదం వారి ఫ్యామిలీని కుదిపేశింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనల్లుడు ఉదయ్ కుమార్ నేడు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గుండెపోటుతో హఠాత్తుగా మృతి చెందాడు. చంద్రబాబు నాయుడు రెండవ సోదరి హైమావతి పుత్రుడైన ఉదయ్ కుమార్, మొదటి నుండి అన్ని విషయాల్లోనూ మంచి చలాకీగా ఉండేవాడని, అయితే ఇటీవల కొత్త అస్వస్థతకు గురైన ఉదయ్ డాక్టర్ కి చూపించుకోగా తనను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమని చెప్పారట డాక్టర్లు,
అయితే ఆ విషయాన్నీ పెద్దగా సీరియస్ గా తీసుకోని ఉదయ్, ఎప్పటివలె తన కార్యక్రమాల్లో మునిగిపోయాడని, ఇక పని ఒత్తిడి ఎక్కువ అయిన కారణంగా ఆయనకు హఠాత్తుగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని తన స్వగృహంలో గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయిందని అయన కుటుంబసభ్యులు తెలిపారు. అయితే తన సోదరుడు ఉదయ్ మరణం జూనియర్ ఎన్టీఆర్ ని బాగా కలచివేసిందని అంటున్నారు. నిజానికి ఉదయ్ అంటే ఎన్టీఆర్ కు మంచి అభిమానమని, ఎప్పుడు ఎన్టీఆర్ కు మంచి సహాయకారిగా వుండే ఉదయ్ హఠాన్మరముతో అయన బాగా కృంగిపోయారని అంటున్నారు. కాగా నేడు ఉదయ్ అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here