ఎన్టీఆర్ కు షాకిచ్చిన చరణ్, ఉపాసన!|Ramcharan Christmas Party To Ntr|Garam Chai

0
60
టాలీవుడ్ సినిమాలోని రెండు పెద్ద ఫ్యామిలీలైన మెగా మరియు నందమూరి ఫ్యామిలీల అభిమానుల మధ్య ఎప్పటినుండో కొంత కోల్డ్ వార్ జరుగుతున్నప్పటికీ కూడా ఆ రెండు కుటంబాల హీరోల మధ్య మాత్రం మంచి అనుబంధం ఉందనే చెప్పాలి. ఇక మరీ ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ ల మధ్య మంచి ర్యాపొ వుంది. అది ఎంతలా అంటే, ఒకరి వ్యక్తిగత విషయాలను మరొకరు ఏమాత్రం సంకోచించకుండా పంచుకుంటూ వుంటారు. ఇక రాంచరణ్ పెళ్లి సమయంలో ఎన్టీఆర్, అలానే, ఎన్టీఆర్ పెళ్లి సమయంలో చరణ్ ప్రత్యేకంగా విందులు వినోదాలతో సెలెబ్రేట్ చేసుకున్నారట. ఇక ఇటీవల చరణ్, మరియు ఎన్టీఆర్ ల కుటుంబాలు కలిసి ఫారెన్ టూర్ కూడా వెళ్లివచ్చిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియా వేదికల్లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే, క్రిస్టమస్ సందర్భంగా రామ్ చరణ్ మరియు ఉపాసనలు, ఎన్టీఆర్ దంపతులకు ఒక ప్రత్యేక ట్రీట్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక ఈ ట్రీట్ లో భాగంగా చరణ్ దంపతులు వివిధరకాల వంటకాలు ఎన్టీఅర్ దంపతులకు వడ్డించినట్లు సమాచారం. అయితే ఈ ప్రత్యేక విందుకు ఎంతో మురిసిపోయిన ఎన్టీఆర్ మరియు ప్రణతిలు, నిజముగా చరణ్ మరియు ఉపాసన ఇచ్చిన ఈ ట్రీట్ ని ఎప్పటికి మరిచిపోలేమని అన్నారట. అయితే ఈ విందు వేడుక తరువాత చరణ్, ఉపాసన, కలిసి ఎన్టీఆర్ దంపతులకు ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారని, అదేమిటంటే ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్ లు వారిద్దరికీ కానుకలుగా ఇచ్చారట . అయితే అవి చూసిన ఎన్టీఆర్, ప్రణతి ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఇక ఇటువంటి గుర్తుండిపోయే బహుమతినిచ్చిన చరణ్ మరియు ఉపాసనలు తమకు దీనితో మరింతగా ఆప్తులయ్యారని, వారితో మా అనుబంధం ఈ వేడుకతో మరింత బలపడిందని అన్నారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here