మరొకసారి రిటైర్మెంట్ పై ధోని సంచలన వ్యాఖ్యలు…!

0
97
భారత మాజీ కెప్టెన్ మరియు డాషింగ్ ఓపెనర్ అయిన మహేంద్ర సింగ్ ధోనిఅంటే పడిచచ్చే యువత ఎందరో ఉన్నారనే చెప్పాలి. ఇకపోతే ధోని కొట్టే హెలికాఫ్టర్ షాట్ కు ఫ్యాన్స్ ఎంతోమంది వెర్రెత్తిపోతుంటారు. అయితే అయన ఇటీవల రిటైర్ అవుతారు అంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు షికారు చేయగా వాటిని ధోని ఖండించారు. ఇక నిన్న ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిశాక పెవిలియన్‌కు వస్తూ ఎంఎస్‌ ధోని మరొక్కసారి రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తన చేతిలో ఉన్న బంతిని బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌కు ఇస్తూ, నా దగ్గరి నుంచి బంతి తీసేసుకో,
Image result for dhoni retirement words
లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో అని నవ్వుతూ చెప్పడం టీవీలో రికార్డయింది. అయితే అప్పట్లో ఇంగ్లండ్‌లో వన్డే తర్వాత ధోని బంతి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమై, క్రికెట్‌ నుంచి ధోని రిటైర్‌ అవుతున్నాడనే వార్తలు హల్‌చేశాయి. ఇక తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి ధోని మాట్లాడుతూ, నేను నాలుగో స్థానంలో ఆడినా ఆరో స్థానంలో ఆడినా జట్టు సమతూకం గురించి ఆలోచించాలి. ఆరో స్థానంలో ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జట్టు కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమే అని అన్నారు. ఇక ధోని చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here