మరొక్కసారి బాలకృష్ణ ని టార్గెట్ చేస్తూ నాగబాబు పోస్ట్… సోషల్ మీడియాలో వైరల్!!

0
111
గత కొద్దిరోజులుగా మెగా మరియు నందమూరి ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ మరింతగా ఎక్కువైందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం, ఇటీవల బాలకృష్ణ హిందూపూర్ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటని అడగ్గా, పవన్ కళ్యాణ్ ఎవరు అని అనడంతో ఈ వివాదానికి అగ్గి రాజుకుంది. ఇక ఆ తరువాత నాగబాబు, బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ ఫేస్ బుక్ లో వీడియో పెట్టడం, అలానే ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాత కమెడియన్ బాలకృష్ణ గురించి చెప్పడంతో ఈ వివాదం ముదిరింది. ఇక ప్రస్తుతం ఆయన తన ఫేస్ బుక్ లో పెట్టిన ఒక పోస్ట్ తో దీనికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
Image result for nagababu balakrishna
ఇకపోతే నిన్న రాత్రి అయన ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేస్తూ కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేసారు. “కట్టుకథలు కొన్ని, కల్పనలు కొన్ని, చుట్టనేల మూట కట్టనేల, నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా, విశ్వధాబి రామ వినర మామ” అంటూ ఒక పోస్ట్ చేసారు. అంతేకాదు చివర్లో కవిత్వాలు మాకూ వచ్చండోయి అంటూ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. కాగా అయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్ బయోపిక్ ని ఉద్దేశించి చేసినవి అని, అలానే ఈ విధంగా ఆయన మరొక్కసారి బాలయ్యను టార్గెట్ చేసినట్లు అర్ధం అవుతోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మున్ముందు ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్ సంచలనంగా మారింది ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here