మరొక్కసారి సంచలనం రేపుతున్న పవన్ వ్యాఖ్యలు : టిడిపికి దగ్గరవుతున్నారా?

0
44
గత ఎన్నికల్లో టీడీపీ పార్టీతో జతకట్టి వారి గెలుపుకు సహకరించినందుకు నెను చాలా బాధపడుతున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కొద్దిరోజులుగా వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక చంద్రబాబు గారు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకు తింటోందని, అంతేకాక రాష్ట్రానికి సంజీవనిగా చెప్పుకునే ప్రత్యేక హోదా ను కూడా ఆ పార్టీ తొక్కిపెట్టిందని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక అంతక రాజధాని భూముల విషయంలో చంద్రబాబు మరియు అయన అనునాయులు దోచుకుతిన్నారని, అందువల్ల రాబోయే ఎన్నికల్లో వారి పార్టీని ఓడించి తీరాలని అయన పిలుపునించిన విషయం తెలిసిందే. ఇక నేడు అయన చేసిన వ్యాఖ్యలు మరొక్కసారి టిడిపితో జతకడతారా అనే అనుమానం కలిగేలా చేసాయి. ప్రస్తతం సంక్రాంతి వేడుకలను తన పార్టీ జరుపుకునేందుకు పవన్ గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నపవన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై కక్ష సాధించేందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని నేడు మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో తెనాలి మండలం పెదరావూరు– కూచిపూడి మార్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Image result for janasena pawan kalyan
గతంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌ను తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని అన్నారని, వారే ఇప్పుడు చంద్రబాబు గారిపై కక్ష సాధించేందుకు జగన్‌కు మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే సీఎం చంద్రబాబు పట్ల పవన్‌ కు లోలోపల వున్న ప్రేమను ఆయన తాజా వ్యాఖ్యలు సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దోపిడీ లేని పాలన అందిస్తే అభ్యంతరం లేదు వైఎస్సార్‌సీపీ, టీడీపీ దశాబ్దాలపాటు పాలించవచ్చని, అయితే ఇసుక మాఫియా లేని, ప్రజాధన దోపిడీ లేని పాలనను అందించాలని పవన్‌ అన్నారు. వైఎస్‌ జగన్‌ 30 ఏళ్లు సీఎంగా చేయాలని ఉందని తనకెవరో తెలియజేశారని, అలాగే చంద్రబాబు రావాలని అని వీళ్లూ కోరుకుంటున్నారని, ఎవరు వచ్చినా, అవినీతి లేని పాలన అందించాలన్నారు. 30, 40 ఏళ్లక్రితం నాయకులు చేసిన తప్పులకు ఇప్పుడు రాష్ట్రం విడిపోయి, ఆ తప్పులకు మనం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు తమకు ఆఖరు ఎన్నికలు కాదని, ప్రారంభం మాత్రమేనని జనసేన నాయకులకు చెప్పినట్టు ఆయన తెలిపారు. 25 కిలోల బియ్యం బస్తా కాదు… 25 ఏళ్ల భవిష్యత్తు కావాలన్నదే యువత నినాదమవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్తోపాటు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు, మాజీ మంత్రి పి.బాలరాజు, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి రాబోయే రోజుల్లో వారి పార్టీ రాజకీయ సమీకరణాలు ఎంతవరకు మారుతాయో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజలు వేచిచూడాలి….