టీడీపీ – జనసేన పొత్తుపై మరొక్కసారి క్లారిటీ ఇచ్చిన పవన్…. ఏమన్నారంటే?

0
70
జనసేనతో టీడీపీ పొత్తు గురించి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని ఆయన వెల్లడించారు. ఈ తరహా ప్రకటనలో కార్యకర్తలను అయోమయానికి గురిచేయొద్దని ఆయన ఆదేశించారు. పార్టీ విధానాలపై మాట్లాడేటప్పుడు సంయమనం కోల్పోవద్దని సూచించారు.
Image result for pavan chandrababu
నిజానికి నేడు ఉదయం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అమరావతిలో విలేకర్లతో మాట్లాడారు. తెదేపా, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని అన్నారు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో తెదేపా, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. తెదేపాతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అయితే టిజి వెంకటేష్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసారని, ఇది టిడిపి కుట్రలో ఒక భాగమని, నిజనైకి రాబోయే ఎన్నికల్లో తాము కేవలం వామపక్షాలతో మాత్రమే కలిసి వెళ్తామని మరొక్కసారి అయన స్పష్టం చేసారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here