‘పవిత్రబంధం’ నటి ఆత్మహత్య  …….. షాక్ లో సినిమా వర్గాలు! 

0
124
ఇటీవల కొద్దిరోజులు నుండి పలువురు సినిమా మరియు బుల్లితెర నటులు వరుసగా మృత్యువాత పడుతున్న విషయం అందరిని కలవరపెడుతోంది. ఇక నేడు మరొక నటి ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఫిలిం నగర్ వర్గాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే, నటన మీద మక్కువతో నటి ఝాన్సీ స్వస్థలం కృష్నా జిల్లా ముదినేపల్లి మండలంలోని ఓ గ్రామం నుండి హైదరాబాద్ చేరుకున్నారు. అలా మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్న ఆమెకు సూర్య అలియాస్ నానితో పరిచయం ఏర్పడడం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఝాన్నీ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. నటిగా మంచి భవిష్యత్ తో ముందుకు దూసుకెళుతున్న సమయంలో ఆమె ఆత్మహత్య అందరినీ షాక్ కు గురిచేసింది. అయితే ఆమె ఆత్మహత్యకు సూర్యతో ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.  అయితే అతడితో పరిచయం తర్వాత ఝాన్సీ  సీరియల్స్ మానేసిందని, వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రేమ మోసంతోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ఝాన్సీ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోగా ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసి సూర్య కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అవకాశాలు తగ్గిపోవడం, సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే అంతకముందు రోజు ఆమె, సూర్యతో ఝాన్సీకి గొడవ జరిగినట్టు కూడా ఆమె బంధువులు తెలుపుతున్నారు. మూడు నెలలుగా గొడవలకు విసిగి ఝాన్సీ సూసైడ్ చేసుకున్నటు చెబుతున్నారు. అయితే ఈ విషయమై పూర్తి నిజానిజాలు అతిత్వరలో వెలికితీస్తామని పోలీసులు చెపుతున్నారు. కాగా ఆమె ఆత్మహత్య ఘటన ప్రస్తుతం సినిమా వర్గాల్లో కలకలం రేపుతోంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here