కేసీఆర్ గెలుపుపై పవన్ సంచలన కామెంట్స్!

0
96
ప్రస్తుతం తెలంగాణాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నేటి కౌంటింగ్ ని బట్టి చూస్తే టిఆర్ఎస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం ఖాయంగా కనపడుతోంది. ఇక ఈ ఎన్నికలు మోసానికి, నిజాయితీకి మధ్య జరిగాయని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. గత ఎన్నికల సమయంలో తమ పార్టీకి మంచి మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలు ప్రస్తుతం కూడా ఇంతగొప్ప విజయాన్ని అందిస్తుండడం నిజంగా తమ అదృష్టమని, టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త, మరియు నాయకుడు రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి ప్రజలకు విరివిగా సేవలు అందిస్తారని అయన అంటున్నారు. ఇకపోతే ఇటీవల జనసేన పార్టీని నెలకొల్పిన సినీ హీరో పవన్ కళ్యాణ్, తాను ఏపీలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనడం, అలానే అనుకోని విధంగా తెలంగాణలో ఎన్నికలు నాలుగు నెలలముందుగానే రావడంతో తమ పార్టీ అక్కడ పోటీ చేయలేకపోతోందని,
అయితే గతంలో జరిగిన ఎన్నికలను బట్టి, అప్పటి నాయకులు నిజంగా తమకు మంచి చేసినట్లు భావిస్తే వారికే ఓటు వేసి గెలిపించండి అంటూ కొంత పరోక్షంగా టిఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లుగా ఒక ప్రకటన చేసారు. అయితే తాము చేపట్టిన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలే తమకు ఈ ఎన్నికల్లో కూడా మరొక్కసారి విజయాన్ని అందించాయని టిఆర్ఎస్ శ్రేణులు పండుగ చేసుకుంటూ చెపుతున్నాయి. ఇకపోతే ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఇంత మెజారిటీ రావడానికి కూడా మరొక కారణం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేమిటంటే, గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి పాలన చేయాలనీ భావించి, టీడీపీ, టిజెఎస్, సీపీఐలతో జతకట్టి కొంత తప్పు చేశాయని అంటున్నారు.
కానీ కాంగ్రెస్ ఒకవేళ ప్రజాసేవే పరమావధిగా ఎన్నికల బరిలో ఒంటరిగా నిలిచివుంటే ఇంకొన్ని సీట్లు కాంగ్రెస్ కి వచ్చి ఉండేవనేది వారి భావన. ఇక కూటమిలో వున్న పార్టీలన్నీ కూడా కేవలం మాటల పార్టీలే అని అనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కూడా వారు అంటున్నారు. ఇక టిఆర్ఎస్ విజయంపై కాసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకులూ కేసీఆర్ గారికి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పినట్లు సమాచారం. గత ఎన్నికల్లో మీరు చేసిన అభివృద్ధి మంత్రమే మిమ్మల్ని గెలిపించిందని, మీరు రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సురక్షితమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారట. అయితే ఇది తెలంగాణ ప్రజల విజయమని, రాబోయే రోజుల్లో ఏపీలో పవన్ కు మంచి మెజారిటీ రావాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ బదులుగా చెప్పారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here