480 కోట్లతో చరిత్ర తిరగరాసిన పవన్ కళ్యాణ్…. మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
90
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తాను స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో విరివిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే అయన పార్టీ పై కొన్నాళ్ల క్రితం నుండి, అది ఒక కుల పార్టీ అని, అలానే పవన్ కు రాజకీయాలు తెలియవని పలు విధాలుగా కొన్ని మీడియా ఛానల్స్ కథనాలు ప్రసారమైన విషయం తెలిసిందే. అంతేకాక కొన్నాళ్ల క్రితం నటి శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ గారి తల్లి, అంజనాదేవికి ఉద్దేశించి చేసిన ఒక తప్పుడు వ్యాఖ్యవల్ల ఎంతో మనోవేదనకు గురైన పవన్, అప్పట్లో మా అసోసియేషన్ కు వచ్చి ఫిర్యాదు కూడా చేసారు. అయితే తాను ఆమె అన్నందుకు మాత్రమే కాదు, ఆ విషయాన్నీ కొన్ని ఛానల్స్ విపరీతంగా ఆ వార్తను పదే పదే ట్రొల్స్ చేస్తూ చూపించడం తనను మరింతగా బాధించిందని, అందువల్ల అటువంటి ఛానల్స్ ని చూడవద్దని తన అభిమానులకు ఒక పిలుపును ఇవ్వడం జరిగింది.
Image result for janasena pawan kalyan
ఇక ఆ తరువాత అయన పిలుపు ఒక్క ప్రభంజనంలా మారింది. పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి యెల్లో మీడియా చానెల్స్ అన్ని దారుణంగా నష్టపోయాయి. ఇటీవల BARC సంస్థ 2018 కి గాను ఒక రేపో రేటుని విడుదల చేస్తూ, టీవీ సంస్థల లాభ నష్టాలను ఒక నివేదిక గా ఇచ్చింది. ఆ నివేదికల ప్రకారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టివి9 గత ఏడాది 43 పాయింట్ల టిఆర్పి రేటింగ్స్ దక్కించుకుని అగ్రస్థానంలో కొనసాగి, గత ఏడాది ఒక్కసారిగా కేవలం 23 పాయింట్లు మాత్రం సాధించి చాలా వెనుకపడిందట. దానివల్ల ఏకంగా 480 కోట్ల రూపాయిలు వారికి నష్టం వాటిల్లినట్టు BAARC సంస్థ పేర్కొనింది. ఇది ఒక సంచలన విప్లవం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ప్రస్తుతం ఈ వార్త అటు టాలీవుడ్, ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here