ఓ అభిమాని వల్ల కింద పడ్డ పవన్…

0
54

ఎన్నికల వేళా అభిమానులు, కార్యకర్తలు తీరు పార్టీ అధినేతలు , అభ్యర్థులను ఇబ్బంది కి గురిచేస్తుంటారు. ఘటనలు పలుచోట్ల చోటుచేసుకుంటాయి. ఇటీవల రోడ్ షో లో వైస్ షర్మిల ఉంగరాన్ని లాక్కునేందుకు ఓ కార్యకర్త ప్రత్నించగా .. తాజాగా విజయనగరంలో జనసేన బహిరంగ సభ లో ఓ అభిమాని అతి ఉత్సాహం ప్రదర్శించాడు .

పవన్ వేదిక పై మాట్లాడేటందుకు సిద్ధం అవుతుండగా … ఓ అభిమాని వెనుక నుంచి వచ్చి పవన్ కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఈ సంఘటనలో ఆయన ఒక్కసారిగా తుళ్ళిపడి వేదికపై కింద పడిపోయారు. మైక్ విరిగి పోయింది. వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది అయ్యానని పైకి లేపారు. అనంతరం ఆ అభిమానిని అదుపులోకి తీసుకొని పాలీసులకి అప్పగించారు. విజయనగరంలో  అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదిక పైకి పవన్ చేరుకున్న కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here