పెథాయ్ తుఫాను వల్ల జరిగిన నష్టానికి ఆవేదన గురై రైతు ఆత్మహత్యాయత్నం

0
96
ఆంధ్ర ప్రాంత వాసులను ఎంతో భయబ్రాంతులకు గురిచేస్తున్న పెథాయ్ తుఫాను ప్రభావంతో కోస్తా ప్రాంతమంతా అతలాకుతలం అవుతోంది. దీనిప్రభావంతో ఇప్పటికే అక్కడి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నేటి సాయంత్రానికి ఈ తుఫాను తీరాన్ని దాటుతుండడంతో దాని ఉగ్రరూపానికి గురికావద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇక నిన్నటి నుండి తుఫాను ప్రభావిత ప్రాంతాల స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాక జాలర్లను సైతం అప్రమత్తంగా ఉండమని తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.  ఇక ఇప్పటికే కోస్తా ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాక సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని, మేము అధికారిక ప్రకటన చేసేవరకు జాలర్లు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ తుఫానును ఎదుర్కోవడానికి మేము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. తుఫాన్ అనంతరం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు అయన చెప్పారు. అయితే నేటి సాయంత్రానికి తీరం దాటే ఈ పెతాయ్ తుఫాను, తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కీలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
కాబట్టి ఆయా ప్రాంతాల ప్రజలు ఎక్కువగా బయటకు రాకుండా తమ ఇళ్లలోనే ఉంటే మంచిదని అధికారులు అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ తుఫాను తాకిడి అనేక ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరగడంతో ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తూ, ప్రభుత్వం తమను ఆదుకుని పంట నష్టంలో కొంతైనా ఇప్పిస్తే మంచిదని, లేకపోతే తమ కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని అంటున్నారు. ఇక నిన్నటి వర్షాలకు కుప్పనూర్చనికి సిద్ధంగా వున్న ధాన్యం మొత్తం వర్షానికి నాశనం కావడంతో తూర్పుగోవదారి జిల్లాకు చెందిన ఒక రైతు ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతవాసుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పంట చేతికి రాగానే దానిని అమ్మి అప్పులు తీర్చి, మిగతా డబ్బుతో తన కూతురు పెళ్ళికి ఖర్చుపెట్టాలని భావించిన కృష్ణ అనే రైతు ఆలోచనకు ఈ అకాల తుఫాను గండికొట్టడంతో, అతడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడట. ఇక విషయాన్నీ తెలుసుకున్న అక్కడి అధికారులు, కృష్ణ మృతికి ప్రభుత్వం నుండి కొంత మొత్తాన్ని ఆర్థికసాయంరూపంలో అందిస్తామని భరోసా ఇచ్చారట. అయితే ఒక వ్యక్తి మరణించాక ఇలా ప్రభుత్వం సహాయం ప్రకటించడం దారుణమని, అదే అధికారులు ముందుగా అతడికి బాసటగా నిలిస్తే ఒక నిండు ప్రాణం నిలబడేదని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here