పెథాయ్ తుఫాను ధాటికి కూలిన స్థంభం…..కారు విధ్వంసం….జరిగిన భీబత్సం చూస్తే షాకే!

0
98
ప్రస్తుతం ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పెతాయ్ తుఫాను కాసేపటిక్రితం తీరాన్ని  తాకినట్లు వాతావరణ అధికారుల నుండి సమాచారం అందుతోంది. ఇక ఈ తుఫాను ధాటికి ఎక్కువగా కోస్తా లోని తూర్పు గోదావరి ప్రాంతంలో నష్టం సంభవించినట్లు సమాచారం. అంతేకాదు కోస్తా ప్రాంతాల్లో గాలులు గంటకు 80 నుండి 100 కిమీ వేగంతో వీస్తూ భారీగా పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై హోంమంత్రి చిన రాజప్ప అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీని తీవ్రత తూర్పు గోదావరి జిల్లాపైనే అధికంగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్ధాల కొరత లేకుండా చూస్తున్నాం. తుపాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుంది. అని మంత్రి చిన రాజప్ప తెలిపారు.
ఇక ఈ తుఫాను భీభత్సానికి కొన్ని ఇళ్ళు మరియు వాహనాలు కూడా దెబ్బతిన్నాయని తెలుస్తోంది. ఇక దీని ప్రభావానికి అనేక ప్రాంతాల్లో పెద్ద వృక్షాలు సైతం నేలకూలాయని, మరియు కొన్ని రహదారుల్లో చెట్లు నేలకొరిగి రాకపోకలకు అడ్డంపైగా మారాయని,అయితే అవి ఏయే ప్రాంతాల్లో విరిగిపడ్డాయి అనేది ప్రజల సమాచారం ద్వారా తెలుసుకుని, అక్కడికి అధికారులు వెళ్లి వాటిని తొలగించడం జరుగుతుందని చినరాజప్ప అంటున్నారు. ఇక ప్రస్తుతం కాకినాడ ప్రాంత రహదారిపై వెళ్తున్న ఒకకారుపై అమాంతం ప్రక్కనే వున్న విద్యుత్ స్తంభం కూలడంతో కారు కొంత ధ్వంశమైంది. అయితే ఆ సమయంలో కారులోని వారికి చాలాభయంవేసిందని, స్తంభం నేలకొరగడంతో వెంటనే వారు కారు దిగి బయటకు వచ్చేసారని, ఆ సమయంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం కలగకపోవడం మంచిదయిందని ఆ దారివెంట వెళుతున్న వారు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here