తీరం దాటనున్న ఫోని తుఫాన్ ఆందోళనలో ఉత్తరాంధ్ర ప్రజలు

0
36

ఏ సమయం లో ఫోను తుఫాన్ విరుచుకు పడుతుందో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరి భయపడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. ఈ తుఫాన్ ఎక్కువగా శ్రీకాకుళం , విజయ నగరం జిల్లాలకు భారీ గా నష్టం కలగనుంది చెప్తున్నారు . వాతావరణ శాఖ  కేంద్రం హెచ్చరించింది . రేపు తీరాన్ని దాటే అవకాశం ఉండటం తో దాదాపు 150 – 200 కిలోమీటర్ ల వేగం తో గాలులు వీచే అవకాశము ఉందని చెప్పుకొస్తున్నారు .

ఇది ఎక్కువగా   ఒడిశా కు తీవ్ర ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందని కానీ ఉత్తరాంధ్రకు కూడా కొంత వరకు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది వాతావరణ శాఖ . ఈ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర లో భారీ వర్షాలు పడతాయని , జాలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రం లోపలోకి వెళ్లకూడదని హెచ్చరించారు . ఈ తుఫాన్ వస్తే ఎంతటి భీభత్సాన్ని సృష్టిస్తుందో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here