ఎయిర్ టెల్ కస్టమర్లకు సంక్రాంతి బంపర్ ఆఫర్….!!

0
47
ప్రస్తుతం మన దేశంలో టెలికాం రంగంలో విపరీతమైన పోటీ నెలకొనివున్న విషయం తెలిసిందే. ఇక ఈ రంగంలోకి ఇటీవల జియో పేరుతో ప్రవేశించిన రిలయన్స్ సంస్థ ఫ్రీ కాల్స్, ఫ్రీ ఇంటర్నెట్ అందించి కస్టమర్స్ ని ఆకట్టుకుంటూ ప్రస్తుతం ప్రధమ స్థానంలో దూసుకుపోతోంది. ఇక పోతే దానిని తట్టుకోవడానికి మిగతా టెలికాం కంపెనీలు కూడా సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, భారతీయ రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్‌టెల్‌ తన కస‍్టమర్లకు ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది.
Image result for airtel
అదేంటంటే, ఇకపై ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ యాక్టివేషన్‌  రుసుమును నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాక ఇది ప్రీ పెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ చందాదారులిద్దరికీ వర్తిస్తుందని తెలిపింది. ఈమేరకు ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు సీఈఓ గోపాల్  విట్టల్‌ ఏఈ సమాచారాన్ని ఒక ప్రకటన రూపంలో అందించారు. ఇకపై తమ స్మార్ట్‌ ప్యాక్‌లతో అంతర్జాతీయ బిల్లుల భారం గురించి విచారించకండి, మా ఈ నూతన ఆఫర్లను వినియోగించుకోండి అని తెలిపింది. అయితే ఈ అఫర్ ద్వారా ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ప్యాక్‌లను పెంచుకోవాలని ఎయిర్ టెల్ చూస్తోంది..