RRR లో సందడి చెయ్యనున్న ప్రభాస్

0
47
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం RRR . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది . ఈ మూవీ లో ఎన్టీఆర్ , రాంచరణ్ ల పాత్ర ఎలాఉంటుందో అనేది ఇటీవలే చిత్ర బృందం తెలిపింది . ఎన్టీఆర్ కొమురం భీం లా మరియు రాంచరణ్ అల్లూరిసీతారామ రాజులా ఉంటారని తెలిసిందే . ఎన్టీఆర్ సరసన ఎంపికచేసిన హీరోయిన్ ఇటీవల అనివార్య కారణాల వల్ల వైదొలిగిన విషయం అందరికి తెలిసిందే . ఆ హీరోయిన్ పోవడం , రాంచరణ్ కు దెబ్బ తగలడం ఒక విధంగా దెబ్బె అని చెపొచ్చు .
ఇక రాజమౌళి , ప్రభాస్ ల మధ్య వచ్చిన బాహుబలి ఎంతటి ఘన విజయాన్ని నమోదుచేసిందో చెప్పనక్కర్లేదు.  ఇప్పుడు మల్లి rrr లో కూడా ప్రభాస్ సందడి చేయనున్నట్లు తెలుస్తుంది . రాంచరణ్ , ఎన్టీఆర్ ల పరిచయం ప్రభాస్ వాయిస్ తో ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే . ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల  rrr షూటింగ్ వాయిదా పడింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here