రాజమౌళి ఇంట పెళ్లి సందడి….. రామ్ చరణ్, ప్రభాస్ చేసిన సందడి చూస్తే మతిపోతుంది!

0
76
తన సినిమా కెరీర్ లో ఒక్క అపజయం కూడా లేని దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలయికలో RRR పేరుతో ఒక భారీ మల్టి స్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ  మంచి అంచనాలున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లిని ప్రముఖ నటుడు జగపతి బాబు సోదరుడి కుమార్తె అయిన పూజ ప్రసాద్ తో నిశ్చయించారు రాజమౌళి దంపతులు. ఇక వీరి వివాహం ఈనెల 30వ తేదీన జైపూర్ లోని ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇకపోతే ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుండి ఎందరో ప్రముఖులు హాజరుకానున్నారు. అంతేకాక కొందరు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతుండడంతో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకుంది.
Image result for prabhas and ramcharan dancing in rajamouli son wedding
Image result for ramcharan dancing in rajamouli son wedding
ఇక నిన్న సాయంత్రం ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, రానా, నాని, అనుష్క మరికొందరు టాలీవుడ్ హీరోలు ఈ వేడుకకు బయల్దేరి వెళ్లారు. అయితే ఈ వారు విచ్చేసిన వెంటనే రాజమౌళి దంపతులు వారికీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇక ప్రభాస్ మరియు రామ్ చరణ్, తమ కార్లు దిగి రాజమౌళితో పాటు డాన్సులు వేసి అందరిని ఉత్సాహపరిచారు. అయితే మొదటినుండి రాజమౌళితో మంచి సాన్నిహిత్యం వుండడంతోనే వారు పెళ్లివేడుకకు ముందుగా హాజరయ్యారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇకపోతే ఈ పెళ్లికి ఎన్నో ప్రత్యేక ఏర్పాట్లు చేసారని, అంతేకాక ఈ వేడుకకు దేశ విదేశాల నుండి ప్రఖ్యాత చెఫ్ లను పిలిపించి వారితో రకరకాల వంటకాలను కూడా వండి వడ్డించనున్నారట. కాగా ప్రస్తుతం ప్రభాస్, మరియు చరణ్ చేసిన డాన్స్ ల వీడియో సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ గా మారింది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here