ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటున్న ప్రభాస్!

0
78
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి విజయం తరువాత ప్రభాస్ రేంజ్ పెరగడంతో ఈ సినిమాని అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తోంది యువి క్రియేషన్స్ సంస్థ. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటిస్తున్నారు. ఇక మరోవైపు కొద్దిరోజుల క్రితం జిల్ మూవీ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో మరొక మూవీ ప్రారంభించిన ప్రభాస్,
Image result for prabhas
సాహూ షూటింగ్ కి విరామం సమయంలో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారట. అంతేకాక ఇకనుండి తన కాల్ షీట్స్ రెండు సినిమాలకు సమంగా అడ్జస్ట్ చేసుకునేలా ప్లాన్ చేశారట కూడా. అయితే సాహూ రేపు ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవ కానుకగా విడుదలవుతుంటే, రాధా కృష్ణ సినిమా వచ్చే సంక్రాంతికి వస్తుందని సమాచారం. ఇక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అదేనండి సినిమాలు లైన్ లో పెట్టిన ప్రభాస్, రాబోయే రోజుల్లో తన ఫ్యాన్స్ కు ఈ రెండు సినిమాలతో మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు అర్ధం అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here