ప్రభాస్ కు రియల్ లైఫ్ విలన్లు ఎవరో తెలియదు : హైకోర్ట్!

0
68
ఇటీవల కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో సర్వే నెంబర్ 46లో గల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు తమవద్దకు ఫిర్యాదులు రావడంతో అటువంటి భోముల్లో గల అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించి వాటిని జిహెచ్ఎంసి తరపున సీజ్ చేసినట్లు తహశీల్ధార్ వాసు చంద్ర ఆ సమయంలో తెలిపారు. ఇక ఆ సమయంలో అక్కడ వున్న సినీ హీరో ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ను కూడా రెవెన్యూ అధికారులు సీల్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హై కోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక దానిపై నిన్న గురువారం ఇరు పక్షాల వాదనల ముగిసాయి. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి. కేశవరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌ కేసులో అధికారులు చట్ట నిబంధనలు పాటించలేదని ఆక్షేపించింది. పిటిషనర్‌ కాకుండా ఎవరైనా సామాన్యులు కోర్టుకు వచ్చి ఉంటే అదేరోజు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేవారమని చెప్పింది. ఇలాంటి పిటిషనర్లకు రియల్‌ లైఫ్‌ విలన్లు తెలియదని వ్యాఖ్యానించింది.
Related image
ప్రభుత్వ భూమిని మాఫియా ఆక్రమిస్తోందని స్పెషల్‌ జీపీ పేర్కొనగా, మాఫియా ఆక్రమిస్తే క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోరని, వారికి అధికారులు సైతం సహకరిస్తూ ఉంటారని వ్యాఖ్యానించింది. చట్టానికి కట్టుబడే వ్యక్తులే క్రమబద్ధీకరణ కోసం వస్తారని అభిప్రాయపడింది. పిటిషనర్‌ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, ఇలాంటి వారికి సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు మినహా ప్రభాస్‌ మరే ఇతర ఆధారాలు చూపలేదని చెప్పారు. మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయలేదని ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు గెస్ట్‌హౌ్‌సను కూల్చివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. క్రమబద్ధీకరణ కోసం మరోసారి దరఖాస్తు చేస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అప్పటి వరకు స్టేట్‌సకో పాటించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయమై ప్రభాస్ కు ఊరట లభిస్తుందా, లేక అయన తన గెస్ట్ హౌస్ ని వదులుకోవలసి వస్తుందా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు ఓపికపట్టవలసిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here