ప్రభాస్ ఇంటిని సీజ్ చేసిన అధికారులు ,త్వరలో ఆయన్నుకూడా అరెస్ట్ చేసే అవకాశం?|garamchai

0
86
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్ ఒక జాతీయ స్థాయి నటుడిగా తన పేరును మరియు క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయం తరువాత ప్రభాస్ కు ఇంతటి పేరు దక్కింది. అంతేకాక ఆ సినిమాలు ల్యాండ్ మార్క్ విజయాలను అందుకుని ఆయన మార్కెట్ ని అమాంతం పెంచేయడంతో ఇకపై రూపొందే ప్రభాస్ సినిమాలన్నీ దేశవ్యాప్త భాషలన్నింటిలోనూ విడుదల కానున్నాయి. ఇక నేడు ఆయనకు సంబంధించి వైరల్ అవుతున్న ఒక వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో ఆందోళనతో కామెంట్స్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే, ఇటీవల ఎన్నికల హడావుడి నేపథ్యంలో కొన్నాళ్ళనుండి జిహెచ్ఎంసి పరిధిలోని అక్రమ నిర్మాణాలపై కొంత మౌనం వచించిన తెలంగాణ సర్కారు వారు, ప్రస్తుతం మరొక్కసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం, అదేవిధంగా అటువంటి అక్రమాలపై ఫిర్యాదులు కూడా రోజురోజుకు పెరగడంతో అటువంటి నిర్మాణాలపై మళ్ళి కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక ఈ కూల్చీ వేతల్లోభాగంగా రాయదుర్గం ప్రాంతంలోని సర్వే నెంబర్ 46 ప్రాంతంలో గల 80 ఎకరాల భూమి ప్రబుత్వానిదే అని, అయితే దానిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనపరుచుకుని నిర్మాణాలను ఏర్పరుచుకున్నట్లు తమకు ఫిర్యాదు రావడంతో అధికారులు ఆ స్థలంలో గల నిర్మాణాలను కూల్చివేశారు. అంతేకాదు ఆ ప్రాంతంలో వున్న ప్రభాస్ గెస్ట్ హౌస్ ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి ఆ ఇంటిని సీజ్ చేసే సమయంలో ఎవ్వరు లేకపోవడం, అలానే ఆ స్థల విషయమై తమకు పూర్తి సమాచారం మరియు పత్రాలు చూపిన తరువాతనే తాము ఇంటిని ఓనర్లకు స్వాధీనం చేస్తామని అధికారులు చెపుతున్నారు. అయితే ఆ ఇల్లు ప్రభాస్ ది అనే సమాచారం ఉన్నపటికీ, ఎంతటివారైనా ప్రభుత్వానికి సమానమేనని, కావున సరైన పత్రాలు చూపి తమ ఇంటిని తాము విడిపించుకోవచ్చని, అలా లేని పక్షంలో ఆయనపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయవలసి ఉంటుందని వారు అంటున్నారు. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరకు ప్రభాస్ వద్దకు చేరిందని, ఇక నేడో లేక రేపో ప్రభాస్ తన మేనేజర్ ని ఆ ఇంటి పత్రాలతో జిహెచ్ఎంసి అధికారులవద్దకు పంపి తన ఇంటిని విడిపించుకోనున్నారని కొందరు అయన సన్నిహితులు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here