రూ. 200 కోట్లకు తగ్గని బాహుబలి ప్రభాస్ రేంజ్!

0
67
ఇప్పటికే బాహుబలి సినిమాతో తన క్రేజ్, మరియు మార్కెట్ స్థాయిని ఒక్కసారిగా పెంచేసుకున్న హీరో ప్రభాస్, ఆ సినిమా తరువాత ప్రస్తుతం రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా బడ్జెట్ రూ. 250 కోట్లకు పైమాటేనట. ఇప్పటికే అరవైశాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఆ సినిమా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మరొకవైపు ప్రభాస్, జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణతో మరొక సినిమాను ఇటీవల మొదలెట్టారు.
Image result for prabhas pooja hegde
పూజ హెగ్డే ఇందులో కథానాయిక. అయితే పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా దాదాపుగా రూ.200 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందనుందట. అయితే ఈ సినిమాకు కూడా కథ ప్రకారం అంత ఖర్చు అవసరం అని, అందువల్లనే ఖర్చుపెడుతున్నాం అని యువి క్రియేషన్స్ సంస్థ చెపుతోంది. అయితే దీన్నిబట్టి చూస్తే, మన బాహుబలి రాబోయే సినిమాలు కూడా రూ.200 కోట్లకుపైగా ఖర్చుకు తగ్గకుండా రూపొందనున్నాయని, అలానే వాటి మార్కెట్ కూడా అంతకుమించి జరగనుందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here