RRR మూవీలో ప్రత్యేక పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడా?

0
87
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి రెండు భాగాల అద్భుత విజయం తరువాత తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పిరియాడిక్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే కొన్ని టాలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్ లో హల్‌చల్‌ చేస్తోంది.
Image result for prabhas in rrr movie
ఈ సినిమాలో బాహుబలి స్టార్‌ ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి కసరత్తులు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే  ఈ సినిమాకు సంబంధించి చాలా వార్తలు వినిపిస్తున్నా చిత్రయూనిట్ మాత్రం ఏ ఒక విషయాన్ని కూడా కన్ఫామ్‌ చేయాలేదు. మరి ప్రభాస్‌ అతిథి పాత్ర పై అయినా జక్కన టీం స్పందిస్తుందేమో చూడాలి. అయితే కొందరు చెపుతున్న ప్రకారం, రాజమౌళి ఆహ్వానం మేరకే ప్రభాస్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here