2.0 పై ప్రభాస్ ఊహించని వ్యాఖ్య.. తెలిస్తే షాక్ అవుతారు!

0
120
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక జాతీయస్థాయి నటుడు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎందుకంటే అయన నటించిన బాహుబలి రెండు భాగాలూ దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో కూడా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకున్నాయో అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం అయన రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సాహో సినిమాలో నటిస్తున్నారు. ఇక రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 2.0 సినిమాపై యంగ్ రెబల్ స్టార్ చేసిన సంచలన కామెంట్స్ పలు మీడియా వర్గాల్లో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్ షోని చూసిన ప్రభాస్ ఇలా మాట్లాడారు..తాను ఇదివరకు నటించిన బాహుబలి సినిమా మంచి కథ, కథనాలు, మరియు ఎమోషన్స్ తో సాగినప్పటికీ కూడా సినిమాలో గ్రాఫిక్స్ కూడా ఎంతటి ప్రధాన పాత్ర పోషించాయో అందరికి తెలిసిందే. అంతేకాదు ఆ గ్రాఫిక్స్ గురించి ఇప్పటికీ ఎంతో మంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటే అది కేవలం దర్శకుడు రాజమౌళి, మరియు మా టీమ్ ప్రతిభ అని ప్రభాస్ చెప్పారు.
ఇక ఈ 2.0 సినిమా చూసిన తరువాత తనకు ఒక్క విషయం మాత్రం అర్ధం అయిందని, ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్ మూవీ గా నిలిచిపోవడం ఖాయమని ప్రభాస్ చెప్పినట్లు సమాచారం. సినిమా ఆద్యంతం తనకు కథతో పాటు అందులో మిళితమై వున్న విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే ఇది నిజంగా ఇండియన్ సినిమానా లేక హాలీవుడ్ సినిమానా అని ఆయనకు అనిపించిందట. అంతేకాదు సినిమాని శంకర్ తెరకెక్కించిన తీరు చూస్తుంటే, రేపు సినిమా సూపర్ హిట్ అయితే, అందులో సింహభాగం శంకర్ కె దక్కుతుందని కూడా ప్రభాస్ అన్నారట. ఇక ఇటువంటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిన సినిమాని మా బాహుబలి మాదిరిగానే తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రభాస్ ఈ విధంగా 2.0 పై ప్రశంశల జల్లు కురిపించడంతో, ఇంక ఆ సినిమాకి ఢోకా లేదని, తప్పకుండా విజయవంతం అవుతుందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here