రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకాష్ రాజ్ కీలక ప్రకటన….. మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
77
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కొద్దిరోజలుగా బీజేపీ ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీపై పలువిధాలుగా విమర్శలు ఎక్కుపెడుతూ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నూతన సంవత్సరం రోజున అయన ఒక కీలక ప్రకటన చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. ‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీఅందరి మద్ధతుతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్నాను. అయితే అది  ఎక్కడి నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తా అంటూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేస్తూ తెలిపారు.
Image result for prakash raj
అంతేకాదు రాబోయే ఎన్నికల్లో వచ్చేది ప్రజా ప్రభుత్వమే’’ అంటూ ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్ చేయడం గమనార్హం. ఇక ఇటీవల తమిళ నటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తరువాత రాజకీయ ప్రకటన చేసిన నటుడిగా ప్రకాశ్‌రాజ్‌ నిలిచారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సీఎం కేసీఆర్‌తో కలిసి పలు అంశాలపై అయన చర్చించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రకాశ్‌రాజ్‌ ప్రకటన  రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఈ వార్త వైరల్ గ మరి సంచలనం సృష్టిస్తోంది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here