ఈ వీడియోని రాత్రిపూట మాత్రమే చూడండి…..అది కూడా ఒంటరిగా…లేకపోతే మీకే నష్టం!

0
100
సినీ పరిశ్రమలో నటీనటులపై గాసిప్స్ రావడం మాములు విషయమే. అయితే కొందరు మాత్రం వాటిని కాస్త సీరియస్ గా తీసుకుంటే మరికొందరు మాత్రం, దానిదేముందిలే అంటూ కొంత సిల్లీ గా తీసుకుంటుంటారు. ఇకపోతే ఇటీవల సినిమాల్లోకి వస్తున్న, మరియు వచ్చిన కొందరు హీరోయిన్ లను పలువురు నిర్మాతలు, దర్శకులు మరియు సినిమాకు చెందిన కొందరు ప్రముఖులు వారిని శారీరకంగా వాడుకుని చిత్రహింసలకు గురిచేశారని వార్తలు టాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ గుప్పుమన్న విషయం, అలానే ఇప్పటికీ తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. నిజానికి అవకాశలకోసం తమ జీవితాలను సైతం పణంగా పెట్టి ఇక్కడకు వచ్చిన ఏ అమ్మాయి అయినా కూడా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి మాత్రం బహిరంగ పరచదు. ఎందుకంటే, దానివల్ల తమ కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందేమో అనే భయం వారికి ఉంటుంది.
ఇకపోతే ఇటీవల కొందరు హీరోయిన్లు మరణించిన తీరు చూస్తే, అసలు వారి జీవితంలో ఏమి జరిగిందో, ఇక వారి చావుకు కారణం ఏమిటో కూడా ఇప్పటికే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కొన్నేళ్ల క్రితం అప్పుడప్పుడే సినిమాల్లోకి వస్తూ హీరోయిన్ గా అందరి దృష్టిని ఆకర్షించిన నటి ప్రత్యూష. నిజానికి అప్పట్లో ప్రత్యూషను చూసిన కొందరు నిర్మాతలు కొన్ని బడా సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అయితే అనూహ్యంగా అదే సమయంలో అర్ధాంతరంగా ఆమె మరణించడం అందరిని ఆశ్చర్యంలో పడేసింది. అయితే ఇప్పటికి కూడా ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటనేది పక్కాగా పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఇక మరొక నటి భార్గవి. గుంటూరుకు చెందిన భార్గవి, అష్ట చమ్మ సినిమాతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇక నటిగా తనకు మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో అర్ధాంతరంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడి అందరిని ఆశ్చర్యంలో పడేసింది.
ఇకపోతే మరొక నటి ఇటీవల హిందీలో ప్రసారమైన బాలికవధూ సీరియల్ లో అయేషా పేరుతో పేరుగాంచిన ప్రత్యూష బెనర్జీ. ఈమె కొన్నాళ్ళనుండి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని, అయితే కొన్నాళ్ల నుండి వీరి మధ్య కొంత మనస్పర్థలు వచ్చాయని అంటున్నారు. ఇక అవి వారిద్దరిమద్య మరింత ముదరడంతో భరించలేని ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్య చేసుకున్న సమయంలో ప్రత్యూష ఐదు నెలల గర్భవతి అనే వార్తలు కూడా వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here