చిక్కుల్లో ప్రియా ప్రకాష్ వారియర్ సినిమా కెరీర్… మ్యాటర్ ఏంటంటే?

0
94
కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియోలో తన కనుసైగలతో దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ప్రియా వారియర్ అక్కడినుండి మనవారందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంది. నిజానికి ఆమె నటించిన ఓరు ఆధార్ లవ్ సినిమాలోని పాటలో సీన్ లో ఆమె కనుసైగలతో రకరకాల హావభావాలు పాలిస్తున్న సీన్ అది. అప్పటినుండి ఆమెకు అవకాశాలు కూడా బాగాపెరిగాయి. ఇక  ఆమె ప్రస్తుతం మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది. అయితే ఈ టీజర్లో చూపించిన సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో ప్రియా వారియర్ శ్రీదేవి అనే ఫిల్మ్ స్టార్ పాత్రో నటించింది. టీజర్ చివర్లో ఆమె బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు చూపించడంతో గతేడాది మరణించిన అతిలోక సుందరి శ్రీదేవి ఉదంతం ఉంటుందనే అనుమానాలు తెరపైకి వచ్చాయి.
Image result for sridevi trailer
ఈ టీజర్ చూసిన శ్రీదేవి భర్త బోనీ కపూర్ ‘శ్రీదేవి బంగ్లా’ దర్శక నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు. లీగల్ నోటీసులు అందిన విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ మాంబల్లి ధృవీకరించారు. మా సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. శ్రీదేవి అనేది కామన్ నేమ్ అని బోనీకి కూడా చెప్పాను. ఒక నటి పాత్ర చుట్టూ సినిమా ఉంటుంది. ఈ లీగల్ నోటీసులు ఎదుర్కోవడానికి తాము సిద్ధమే, అయినా మేము ఎవరికీ వ్యతిరేకంగా సినిమా తీయలేదు అని ప్రకటించారు.. అయితే సంచలనం కోసమే శ్రీదేవి పేరు ఈ సినిమాలోని పాత్రకు వాడుకోవడంతో పాటు, ఆమె చనిపోయిన విధంగా బాత్ టబ్ సీన్లు క్రియేట్ చేశారని తెలుస్తోంది. మరి ప్రయత్నం ప్రియా వారియర్ బాలీవుడ్ ఎంట్రీకి ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here