వివాదం రేపుతున్న ప్రియా వారియర్ ముద్దు సీన్…. మ్యాటర్ ఏంటంటే?

0
81
గత ఏడాది తన వెరైటీ కనుసైగతో యావత్ భారత దేశంలోని కుర్రకారునంతటినీ తన మాయలో పడేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఇక ఆ ఒక్క చిన్న వీడియో బిట్ తో దేశవ్యాప్తంగా ప్రియా పాపులర్ అవడంతో, ఆ వీడియోకు మూలాధారమైన ఓరు ఆధార్ లవ్ సినిమా పలు ఇతర భాషల్లో డబ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఇక ఆ ఫంక్షన్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ టీమ్ కు విషెస్ తెలిపారు.
ప్రియా ముద్దు సీన్ గొడవ.. స్కూల్ డ్రెస్ లో అలా చేస్తారా..!
ఇకపోతే మరోవైపు ఈ సినిమాలో ప్రియా, హీరో రోషన్ తో చేసిన ముద్దు సీన్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అయితే ఆ సీన్ లో ప్రియా మరియు రోషన్ స్కూల్ డ్రెస్ లో ఉండడమే అసలు వివాదానికి కారణం అయింది. ఆ ముద్దు సీన్ వలన పిల్లల మనసులు కలుషితం అవుతాయని, ఆ విధంగా స్కూల్ లో పిల్లలు ప్రేమించుకోవాలి అని మీరు మెసేజ్ ఇస్తున్నారా అంటూ పలువురు ప్రజలు మరియు సంఘాల నేతలు చిత్ర యూనిట్ పై విరుచుకుపడుతున్నారు. మరి ఈ వివాదం మున్ముందు మరిన్ని సమస్యలకు కారణమవుతుందో, లేక ఆ సీన్ ని చిత్ర యూనిట్ తీసివేస్తుందో మరి కొద్దీ రోజులు గడిస్తే కానీ తెలియదు………

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here