రూ. 50 కోట్ల సినిమాను రూ.5 కోట్లకు ఇస్తాను అంటున్న ప్రముఖ నిర్మాత!

0
53
ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం అసాధ్యంగా మారితే రూ.50కోట్లతో నిర్మించిన ‘కురుక్షేత్ర’ సినిమాను బీజేపీ నేతలకు 5 కోట్లకు ఇస్తానని రాజరాజేశ్వరీనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సినీ నిర్మాత మునిరత్న సవాల్‌ విసిరారు. బిజెపి పార్టీ మాజీ డీసీఎం అశోక్‌, కుమారస్వామి బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయమై చేసిన వ్యాఖ్యలపై మునిరత్న తీవ్రంగా స్పందిస్తూ,
తాను రూ.50కోట్లు ఖర్చు చేసి కురుక్షేత్ర సినిమాను కుమారస్వామి బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకుంటే 5కోట్లకే ఇస్తానని అందుకు బీజేపీ నేతలు సిద్ధమా అని మీడియా సాక్షిగా సవాల్‌ చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ కర్ణాటకలో కాంగ్రెస్‌ ఉందంటే అది సిద్దరామయ్యతో వల్లనేనని కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే రాజణ్ణ తెలిపారు. ఇక మునిరత్న చేసిన సవాల్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here