పురంధేశ్వరి  వైసిపిలో చేరనున్నారా?…….వైరల్ అవుతున్న న్యూస్!

0
29
మహానటుడు మరియు తిరుగులేని రాజకీయ నాయకుడు అయిన నటరత్న ఎన్టీఆర్ గారి కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి గత కొనేలా క్రితం నుండి బీజేపీ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాక ఇటీవల ఆమె విశాఖపట్నం నియోజకవర్గం నుండి మరొక్కసారి ఆ పార్టీ తరపున ఎంపీగా గెలిచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఎంత తమ్ముడు అయినా పార్టీ పరంగా బాలకృష్ణను విభేదించే పురంధేశ్వరి, రాజకీయాల్లో తనకంటూ కొంత ప్రత్యేక ఇమేజిని సృష్టించుకున్నారు. ఇక రాజకీయాల్లో చిన్నమ్మగా పేరుగాంచిన పురంధేశ్వరి,
Related image
తన రాజకీయ ప్రస్థానంలో ఎక్కువసార్లు తన స్వప్రయోజనాల కోసం పార్టీలు మారడం వంటివి చేయకపోవడంతోనే ఆమె రాజకీయ జీవితంలో పెద్దగా వివాదాలు లేవనేది ఆమె అనునాయులు మరియు అనుచరులు చెప్పేమాట. ఇక ఇటీవల కొద్దిరోజులనుండి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీపై వ్యక్తిరేకత వెల్లువెత్తుతుండడం అంతేకాక మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ఎక్కువ చోట్ల బీజేపీ ఓటమి పాలవడంతో చిన్నమ్మ కూడా పార్టీ మారె యోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతోంది. అంతేకాక ఆమె త్వరలో వైసిపి పార్టీలో చేరుతారని, నిజానికి ఆమె మొదటినుండి వైసీపీపై పెద్దగా విమర్శలు చేయకపోవడానికి అదే కారణమని కొంత వాదన వినపడుతోంది. ఇకపోతే ఆమెకు ఆ పార్టీనుండి మళ్ళి విశాఖ నుండే ఎంపీగా పోటీచేయించాలని జగన్ కూడా భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావలసి వుంది.. కాగా ప్రస్తుతం ఈ వార్త రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది….