పూరి జగన్నాథ్ కొడుకు చాలా ‘రొమాంటిక్’ ! 

0
38
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నారు. ఇక ఇటీవల తన కుమారుడు ఆకాష్ ని హీరోగా లాంచ్ చేస్తూ అయన తీసిన మెహబూబా కూడా బాక్సాఫీస్ దగ్గరా బోల్తా కొట్టింది. ఇకపోతే ఆ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి తనయుడు ప్రస్తుతం రెండవ సినిమాకి రెడీ అయ్యాడు.
తండ్రి పూరినే స్వయంగా అందించిన స్క్రిప్ట్, డైలాగ్స్ అందించడంతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ తన రెండో సినిమా చెయ్యబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఎనౌన్స్ చేసింది చిత్రబృందం. ‘రొమాంటిక్’ అని టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి సరసన ‘గాయత్రీ భరద్వాజ్’ అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా నటిస్తోన్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here