వంగవీటి రాధా ఏ పార్టీలో చేరుతున్నారంటే?

0
66
దివంగత రాజకీయ నాయకుడు వంగవీటి మోహన రంగా తనయుడిగా రాజకీయాల్లో తనకంటూ కొంత ప్రత్యేక ముద్ర వేసుకుని ముందుకు దూసుకెళ్తున్న నవతరం రాజకీయ నాయకులు వంగవీటి రాధా కృష్ణ ఇక ఇటీవల గత ఎన్నికలకు ముందు వైసిపిలో చేరిన రాధా గారు, ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే గతకొద్దిరోజులుగా పార్టీ తనను దూరంగా పెట్టిందని భావించిన రాధా, పార్టీ తరపున నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే రాధా త్వరలోనే పార్టీని వీడుతారు అనుకున్న సందర్భంలో హఠాత్తుగా మొన్న అయన వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసారు.
Image result for vangaveeti radha
ఇక తన భవిష్యత్ ప్రణాలికను మరొక వరం రోజుల్లో ప్రకటిస్తానని రాధా చెప్పుకొచ్చారు . అయితే అయన ఏ పార్టీలో చేరుతున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చనీయాంశంగా మారింది. ఇక కొన్ని వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అయన ఈనెల 25న టీడీపీలో చేరబోతున్నారని, ఈ మేరకు నిన్న రాత్రి చంద్రబాబు తో కలిసి విజయవాడలో చర్చలు కూడా జరిగాయని వినికిడి. ఇక రాధా చేరికతో విజయవాడలో టీడీపీ బలపడడం ఖాయమని అంటున్నాయి టీడీపీ వర్గాలు. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల వరకు ఓపికపట్టవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here