ధడ పుట్టిస్తున్న రాఘవ లారెన్స్ కాంచన 3 ట్రైలర్ |Telugugarachai

0
40

రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3 ట్రైలర్ అదరగొడుతుంది . 2007 లో ముని హిట్ అవ్వడంతో లారెన్స్ తర్వాత కాంచన , గంగ అంటూ అభిమానులను అలరించాడు . అయితే అదే సీక్వెన్స్ లో వచ్చిన కాంచన 3 అంటే ముని 4 ట్రైలర్ విడుదలైన కాసేపటికే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ లతో దూసుకుపోతుంది . తన దైన శైలిలో లో కథను రూపొందించుకునే లారెన్స్ ఈ మూవీ ని కూడా మంచి కాన్సెప్ట్ తో అలరిస్తునట్టు తెలుస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే . తెల్ల గడ్డంతో ఉన్న లారెన్స్ ఈ సినిమా కు ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు . ఎప్పుడు విభిన్న మైన పాత్రలతో కొత్త కొత్త పాత్రలను పరిచయం చేస్తూ తనదైన శైలిలో సినిమాను హైలైట్ గా ఉంచుతాడు  రాఘవ లారెన్స్.  కాంచన 3 ట్రైలర్ లో చెప్పే డైలాగ్ లు సినిమాకే హైలెట్ గా  ఉన్నాయ్ .  ముని సీక్వెన్స్ గా వచ్చిన ఈ మూవీ లో రాఘవ లారెన్స్ , కోవై సరళ తప్ప మిగతావాళ్ళు కొత్త వారిలా ఉన్నారు . ట్రైలర్ లో ప్రేమ , ఆవేశం , భయం అన్ని కల గలిపి చాలా అందంగా తీర్చి దిద్దారు రాఘవ లారెన్స్ . ఇప్పటి వరకు వచ్చిన ఈ సీక్వెన్స్ లో ఏ  మూవీ కూడా ప్లాప్ అవ్వలేదు కనుక ఈ మూవీ మీద లారెన్స్ అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయ్ . .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here