ప్రాణాలకు తెగించి రైల్వే గార్డు సాహసం….ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో!

0
85
నిజానికి ఒకప్పుడు మన పెద్దలు చెప్పినట్లు మనలో చాలా మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాత్రమే చూసుకునే వారున్నారని, అయితే ఎక్కడో అక్కడ అతి కొద్దీమంది మాత్రమే మిగతా వారి గురించి కూడా పట్టించుకుని మిగతావారిని కూడా మనవారుగా అనుకుని, తమవంతుగా అందరికి సాయం అందించి ముందుకు సాగుతుంటారని చెప్తుంటారు. అంతేకాదు అటువంటి వారి వలననే ఇప్పటికీ భూమి నిలిచిఉంది అనేది వారి మాట. ఇక ఆ విధంగా ఓ సీనియర్‌ రైల్వే గార్డు ప్రాణాలకు తెగించి రైలుకు ఎయిర్‌ బ్రేక్‌ రిలీజ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇక మ్యాటర్ లోకి వెళితే, చామరాజనగర్‌, తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నదిపై వంతెన గుండా ప్రయాణిస్తుండగా  ఓ ప్రయాణికుడు చైన్‌ లాగాడు. ఆ సమయంలో రైలు సరిగ్గా వంతెన మధ్యలో ఆగిపోయింది. మళ్లీ రైలు కదలాలంటే ఎయిర్‌ రిలీజ్‌ చేయాలి. వంతెనపై కావడంతో సులువుగా రైలు దిగి ఎయిర్ రిలీజ్ చేసే అవకాశం లేదు.
దీంతో విష్ణుమూర్తి అనే సీనియర్‌ రైల్వే గార్డు ధైర్యంగా చొరవ తీసుకొని వంతెన పై గల భారీ ఉక్కు బద్దెలపై జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్లి ఎయిర్‌ బ్రేక్‌ను రిలీజ్‌ చేశారు. అయితే ఆ సందర్భంలో ఆయన ఆ బద్దెలపై ఒకే కాలుతో నిలబడి పనిచేయాల్సొచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం పట్టు తప్పినా నదిలో పడిపోయే అవకాశం ఉంది. ఇక ఇంతటి సాహసంతో చాకచక్యంగా ఎయిర్ రిలీజ్ చేసిన అయన గొప్పతనాన్ని పలువురు రైల్ లోని ప్రయాణీకులు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అంతే అయన సాహసాన్ని వీడియో తీసి సోషల్ మీడియా వేదికలో అప్ లోడ్ చేసారు. ఇక ఈ వీడియో ని చూస్తున్న పలువురు నెటిజన్లు అయన గొప్పతనాన్ని మెచ్చుకుంటూ హ్యాట్స్ అని ఆయనపై పొగడ్తల ఝల్లు కురిపిస్తున్నారు. అంతేకాక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టడంతో రైల్వేశాఖ సైతం స్పందించింది. విష్ణుమూర్తికి రూ.5 వేల నగదు బహుమతిని అందజేసింది. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here