రాజమౌళికి అనారోగ్యం…షాక్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్!

0
92
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టి స్టారర్ RRR. ఇక కొన్నాళ్లక్రితం ఈ సినిమా అత్యంత వైభవంగా ప్రారంభోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే, ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకోవడం మొదలెట్టింది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరిచేందుకు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి దిగిన ఒక ఫోటో, మరియు షూటింగ్ ప్రారంభమైన వీడియోని సోషల్ మీడియా వేదికల్లో విడుదల చేశారు. ఇక రెండు రోజులనుండి మంచి ఊపుతో సాగుతున్న ఈ షూటింగ్ కి నేడు అనుకోకుండా బ్రేకులు పడ్డాయట. దానికి ప్రధాన కారణం, రాజమౌళికి ఆరోగ్యం బాగోకపోవడమేనని వినికిడి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి రెండు మూడురోజుల ముందునుండి ఆయనకు కాస్త జ్వరంగా ఉందని, అయినప్పటికీ దానిని పెద్దగా లక్ష్యపెట్టని రాజమౌళి, సోమవారం నుండి ముందు అనుకున్న విధంగా షూటింగ్ లో పాల్గొంటున్నారట.
అయితే రెండు రోజుల తరువాత, అంటే నేడు అయన కొంత అనారోగ్యానికి గురై షూటింగ్ కి రాలేకపోయారని, వెంటనే విషయం తెలుసుకున్న చరణ్, ఎన్టీఆర్ లు అయన ఇంటికి వెళ్లి, మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఎందకు షూటింగ్ మొదలెట్టారు. అయినా మేమిద్దరం మీకు ముందే చెప్పాం కదా, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి, కాస్త మీకు తగ్గాకే షూటింగ్ పెట్టుకుందాం అని అన్నారట. అయినప్పటికీ  ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా మీరు షూటింగ్ మొదలెట్టారు, కాబట్టి ఇకనైనా పూర్తిగా తగ్గేవరకూ మనం షూటింగ్ పెట్టుకోవద్దు, అయినా మా ఇద్దరి బల్క్ డేట్స్ మీ వద్ద వున్నాయి కదా,… ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు మేము మరొక సినిమా అంగీకరించేది లేదు, కాబట్టి మీరు నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి అంటూ ధైర్యం చెప్పారట. ఇక రాజమౌళికి ఆరోగ్యం బాగోలేని విషయం కాసేపటికి కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో న్యూస్ వైరల్ అవడంతో విషయం తెలుసుకున్న అయన అభిమానులు రాజమౌళి గారు మీరు త్వరగా కోలుకోవాలి అంటూ ఆయనకు సోషల్ మీడియా వేదికల్లో గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here