‘కల్కి’ గా రాజశేఖర్ అదరగొట్టే లుక్!

0
69
సీనియర్ హీరో రాజశేఖర్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక కొన్నాళ్ల క్రితం ఎట్టకేలకు ఆయనకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన గరుడావెగా రూపంలో సరైన హిట్ దొరికింది. అయితే ఈ విజయాన్ని అయన అంత తేలిగ్గా తీసుకోలేదు .ఇకపై కూడా మంచి సినిమాలు చేయాలనే తలంపుతో ఆ సినిమా తరువాత అయన అనేకమంది దర్శకుల వద్ద కథలు విన్నారు. ఇక కొద్దిరోజుల క్రితం కొన్నాళ్ల క్రితం అ! అనే వైవిధ్యమైన సినిమాతో తన దర్శకత్వ  నిరూపించుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథకు పచ్చ జండా ఊపారు రాజశేఖర్. ఇక ఈ సినిమా టైటిల్ ని కల్కి గా నిర్ణయిస్తూ కొద్దిరోజుల క్రితం యూనిట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని న్యూఇయర్ సందర్భంగా విడుదల చేసారు. నిన్న విడుదలైన టీజర్, ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. ఇక ఈ సినిమా 1983 బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. హ్యాపీ న్యూఇయర్ 1983 అంటూ విడుదల చేసిన రాజశేఖర్ లుక్ ఆ కాలానికి తగ్గట్లుగా ఉంది.  ‘గరుడ వేగ’ చిత్రంతో సక్సెస్ కొట్టిన రాజశేఖర్ ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘కల్కి’తో మరొక విజయం పొందుతారని యూనిట్ సభ్యులు చెపుతున్నారు. ఈ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. మరి రాజశేఖర్ ఆశిస్తోన్న సక్సెస్ ఈ ‘కల్కి’ ఇస్తుందో లేదో తెలియాలంటే మాత్రం చిత్ర విజయం వరకు వేచి చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here