అవకాశాలు లేకే సినిమావారు వైసిపిలో చేరుతున్నారు : రాజేంద్రప్రసాద్

0
45

ఏపీ ఎన్నికల నగారా మోగింది ఎక్కడ చూసిన సరే ఎవరికీ వారు ప్రచారం లో దూసుకుపోతున్నారు . వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి ప్రజలను ఆకర్షితులను చేస్తున్నారు .

ఇక వైసిపి లో సినిమా వాళ్ళ చేరిక రోజు రోజుకూ పెరుగుతూనే వుంది గతం లో చూసుకుంటే అలీ , శివాజీ రాజా  ఇక ఈ రోజు జీవిత , రాజశేఖర్ లు చేరారు. ఇక ఈ చేరిక పై స్పందించిన టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ తీవ్రంగా విమర్శించారు .

 సినిమా వారికి అవకాశం లేకే వైసిపిలో చేరుతున్నారని అంతే తప్ప రాజకీయాల కోసం కాదని ఎద్దేవా చేశారు . ప్రచారం కోసం మాత్రమే జగన్ వారిని వాడుకుంటున్నారని ఆరో పించారు . వారి కాల్ షీట్లను జగన్ కు అమ్మేశారని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్ . ఇక మోడీ విషయానికొస్తే చంద్రబాబు ని తీవ్రంగా విమర్శిస్తున్న మోడీ జగన్ ను కనీసం ఒక మాట కూడా చెప్పకుండ  ఉండటం హాస్యాస్పదమని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here