పేట మూవీ రివ్యూ ….. టాక్ అదిరిపోయింది!

0
91
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అయన శంకర్ తో కలిసి మూడవ సారి చేసిన 2.0 సినిమా సూపర్ హిట్ కొట్టి రజిని ఫ్యాన్స్ కు మంచి జోష్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా విజయం తరువాత అయన నటించిన కొత్త సినిమా పేట నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి 2.0 సినిమా ఆలస్యం అవుతుండడంతో, కొద్దినెలల క్రితమే రజిని ఈ సినిమాని ఓకే చేసి నటించడం మొదలెట్టారు. ఇక ఈ సినిమాకు పిజ్జా, జిగర్తాండ, మెర్క్యూరీ సినిమాలు తీసిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాపై కేవలం కోలీవుడ్ లోనే కాదు, ఇటు టాలీవుడ్ లోను మంచి అంచనాలున్నాయి.
Image result for rajinikanth peta movie telugu review
ఇక నేటి ఉదయాన్నే పడ్డ బెనిఫిట్ షోలనుండి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమా రజిని ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇవ్వడం ఖాయమని చూసిన వారు చెప్తున్నారు. సినిమాలో మరొక్కసారి రజిని మాస్ హీరోయిజాన్నీ చూడవచ్చని, ఇకపోతే రజిని మంచి యంగ్ గా జోష్ తో సినిమాలో నటించారని అంటున్నారు. ఇక విలన్ పాత్రల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారని అంటున్నారు. ఇక చాలా రోజుల తరువాత కనిపించిన సిమ్రాన్ ఈ సినిమాలో రజినీతో కలిసి చేసిన సీన్స్ ఆకట్టుకుంటాయని, ఇక మరొక హీరోయిన్ త్రిష యాక్టింగ్ సూపర్బ్ అని చూసిన వారు చెపుతున్న మాట. ఇక వారు చెప్తున్న దానినిబట్టి చూస్తుంటే మొత్తంగా సినిమాకు మంచి టాక్ మరియు కలెక్షన్లు రానున్నట్లు అర్ధం అవుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొడుతుందో తెలియాలంటే మరికొద్దిరోజలు ఓపికపట్టవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here