అదరగొట్టిన రజినీకాంత్ ‘పెట్టా’ ట్రైలర్……రజినికి మరొక హిట్ ఖాయమేనా? 

0
83
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన ఇటీవలి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో అయన అభిమానులు తీవ్ర నిరాశలో వుండిపోయిన విషయం తెలిసిందే. అయితే గత నెలలో శంకర్ దర్శకత్వంలో రజిని మూడవసారి చేసిన 2.0 సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి అయన ఫ్యాన్స్ కి మంచి కిక్ ని ఇచ్చింది. ఇక ఆ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అవడంతో అప్పట్లో రజిని, పిజ్జా సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పెట్టా అనే సినిమా కూడా మధ్యలో ఒప్పుకున్నారు. ఇక ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని కొద్దిరోజుల క్రితం విడుదల చేసారు. అయితే టీజర్ అదిరిపోవడంతో ఈ సినిమా కూడా తప్పకుండ మంచి విజయాన్ని అందుకుంటుందని అయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా ట్రైలర్ ని నేడు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో విడుదల చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్. ఇక ట్రైలర్ ఆద్యంతం రజిని వన్ మ్యాన్ షో తో అద్దిరిపోయింది. ట్రైలర్‌లో రజనీ స్టైల్‌, లుక్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇందులో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కన్పించనున్నారట. ఇక ట్రైలర్ లోని ఫైట్ సీన్స్ లో రజనీ స్టైల్‌ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖి కీలక పాత్రలో నటించారు. ట్రైలర్‌ చివర్లో రజనీ స్టెప్పులేసుకుంటూ రావడం ఆకట్టుకుంటోంది.
Image result for petta trailer
ఇందులో మేఘా ఆకాశ్‌, బాబీ సింహా, శశి కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదలైన సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మరణ మాస్‌’ పాట అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తలైవా రజిని ఖైదీగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు యువ సంగీత తరంగం అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. మరి రేపు సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమా ఎంతటి విజయాన్ని దక్కించుకుంటుందో తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు ఆగవలసిందే…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here