లవర్స్ డే పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్!

0
123
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్, ప్రస్తుతం హీరో కార్తీతో కలిసి నటించిన కొత్త సినిమా దేవ్, తమిళం తో పాటు, తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఇక ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ రకుల్ పాల్గొంటున్నారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రకుల్ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. నిజానికి గత ఏడాది తెలుగులో తాను నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో, తన చేతిలో సినిమాలు లేవని కొందరు తప్పుడు రాతలు రాశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత ఏడాది తనకు తమిళ మరియు హిందీ సినిమాల్లో విపరీతమైన బిజీ కారణంగా తెలుగులో నటించడానికి సమయం లేదని,
Related image
అయితే ఈ ఏడాది తన నుండి 4 తెలుగు సినిమాలు వస్తాయని అన్నారు. ఇకపోతే ప్రేమికుల రోజుపై మీ అభిప్రాయం ఏంటని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు రకుల్ సమాధానమిస్తూ, పాశ్చాత్య సంస్కృతి అయిన లవర్స్ డే పై తనకు పెద్దగా నమ్మకం లేదని, అలానే ఆ ఒక్కరోజు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ, ప్రేమికులు షికార్లు చేస్తే సరిపోతుందా, మరి సంవత్సరంలో మిగిలిన రోజులు అలా ప్రేమగా ఉండనవసరం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. నిజానికి మనం ప్రేమించే వ్యక్తితో కలకాలం, అలానే ప్రతిరోజు ఎంతో ప్రేమతో, మరియు సంతోషంతో ఉండాలనేదే తన కోరిక అని రకుల్ తెలిపారు. ఇక లవర్స్ డే పై రకుల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here