బి పాజిటివ్ అంటున్న చరణ్….ఇంటర్నెట్ లో ఫోటోలు వైరల్!

0
80
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి మెగా అభిమానుల్లో మంచి జోష్ నింపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేస్తూ, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఇకపోతే మొన్న జరిగిన రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి వేడుకలో సందడి చేసిన చరణ్ మరియు ఉపాసన, నేటి న్యూ ఇయర్ ని కూడా తమ ఫ్రెండ్స్ మరియు సన్నిహితుల సమక్షంలో ఎంతో వేడుకగా జరుపుకున్నట్లు సమాచారం. ఇక పోతే కాసేపటిక్రితం ఉపాసన, తభ భర్త చరణ్, ప్రముఖ మ్యాగజైన్ బి పాజిటివ్ కవర్ పేజీకి సంబంధించి ఫోటోలను తన సోషల్ మీడియా మాద్యమంలో పోస్ట్ చేసారు. నిజానికి తమ వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను ఎప్పటికపుడు షేర్ చేసే ఉపాసన, ఇప్పుడుఈ పెట్టిన ఈ ఫోటోలపై మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో వావ్ అంటూ చరణ్ పై మరియు అతని ఫిజిక్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలపై ఒక లుక్ వేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here