అవును వినయ విధేయ రామ ఫ్లాప్ అంటున్న చరణ్!

0
100
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇటీవల ఆయన చేసిన సినిమా వినయ విధేయ రామ. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే కలెక్షన్ రాబట్టినప్పటికీ, చివరిగా సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది అనే చెప్పాలి. ఇక నేడు చరణ్ ఆ సినిమా రిజల్ట్ విషయమై స్పందిస్తూ మీడియాకి ఒక లేఖ విడుదల చేసారు. ఆ లేఖ ద్వారా అయన మాట్లాడుతూ, నిజానికి వినయ విధేయ రామ సినిమా మేము ఎంతో కష్టపడి నిర్మించాం.
Image result for ram charan
అంతేకాక ఎందరో సాంకేతిక నిపుణులు ఆ సినిమాకి ఎంతో శ్రమించారని, అయితే ఆ సినిమాతో మీకు సరైన ఎంటెర్టైన్మెంట్ ని విజయాన్ని అందించలేక పోయాను. నన్ను క్షమించండి, ఇకపై రాబోయే రోజుల్లో మీకు సరైన అలరించే సినిమాలు అందిస్తానని ఒక లేఖ ద్వారా మాటిచ్చారు. ఇక సినిమా ఫ్లాప్ అయిన విషయాన్నీ చరణ్ స్వయంగా ఒప్పుకోవడంతో సర్వత్రా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా చరణ్ విడుదల చేసిన ఆ లేఖ ప్రస్తుతం మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here