మహానాయకుడు టీమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ… మ్యాటర్ ఏంటంటే?

0
67
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్, మరియు లక్ష్మి పార్వతి పెళ్లిని ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇక ప్రారంభం నుండి ఎన్నో అంచనాలు సంపాదించిన ఈ సినిమా, వెన్నుపోటు అనే  పల్లవితో సాగె పాట తరువాత ఆ అంచనాలను మరింత పెంచేసిందని చెప్పాలి. ఇక తన సినిమాను ఎటువంటి కల్పితాలు, దాపరికాలు లేకుండా అప్పట్లో ఎన్టీఆర్, లక్ష్మి పార్వతి గార్ల జీవితంలో జరిగిన ఘనాలను యదార్ధంగా, వున్నది వున్నట్లుగా చూపించడం జరుగుతుందని అంటున్నారు.
Image result for  రామ్ గోపాల్ వర్మ
ఇక కాసేపటి క్రితం అయన తన సోషల్ మొయిద మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 14న ఉదయం గం. 9.27ని. విడుదల అవుతుందని, అయితే ఈ ట్రైలర్ రేపు బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల తరువాత ఆ థియేటర్లలో బ్రేక్ టైం లో ప్రదర్శించడం జరుగుతుందని బాంబ్ పేల్చారు. మా సినిమా ట్రైలర్, ఆ సినిమా చూసేవారికి మంచి రెఫ్రెష్మెంట్ అవుతుందని వర్మ అంటున్నారు. ఇక వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకరకంగా ఈవిధంగా వర్మ బాలకృష్ణపై వార్ కు సిద్దమయినట్లే అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here