బాలకృష్ణ పై యుద్దానికి రెడీ అయిన రామ్ గోపాల్ వర్మ… మ్యాటర్ ఏంటంటే?

0
77
ఇప్పటికే వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ వర్గాల్లో పెను సంచలనాన్ని రేకెత్తించిన విషయం తెలిసిందే. నిజానికి ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ వలె తమ సినిమాలో ఎటువంటి దాపరికాలు ఉండవని, అంతేకాక మా సినిమాలో అన్ని నిజాలను ప్రజల ముందు నిర్భయంగా చూపించడం జరుగుతుందని అన్నారు. ఇక నేడు అయన చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఎన్టీఆర్ ప్రజానాయకుడు సినిమాకు గట్టిగా పోటీ ఇచ్చేలా అదే సమయంలో విడుదల చేస్తామని,
అలానే మా సినిమా విడుదల కూడా ప్రజానాయకుడు సినిమా విడుదలను బట్టి నిర్ణయించడం జరుగుతుంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఖచ్చితంగా పైన వున్న ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా మాక్ సపోర్ట్ చేస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక వర్మ చేసిన ఈ కామెంట్స్ తో అయన బాలకృష్ణ ప్రజానాయకుడు పై పోటీకి గట్టిగా సిద్ధమయ్యారని అర్ధం అవుతోంది. మరి ఆ రెండు సినిమాల్లో ఏది విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here