కేఏ పాల్ పాడిన పాటను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ…. వైరల్ అవుతున్న వీడియో!

0
61
ప్రముఖ మత ప్రబోధకుడు కేఏ పాల్ ఇటీవల కొద్దిరోజులుగా పలు మీడియా ఛానల్స్ కి వచ్చి తాను రాబోయే ఎపి ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల సమయంలో కూడా పాల్ ఈ విధంగా హడావుడి చేయడంతో కొందరు అయన మాటలను సిల్లీ గా తీసుకుని పట్టించుకోవడం లేదు. తనను చంద్రబాబు, వైఎస్ వంటివారు తమ పార్టీలకు నిధులు ఇవ్వాలని గతంలో ఒత్తిడులు చేసారని, అలానే వైఎస్సార్ సిపి అధినేత జగన్ కూడా సరైన వ్యక్తి కాదని, ఇక జనసేన పవన్ తనతో కలిసి వస్తే, రాష్ట్రంలో విజయం సాధించవచ్చని అయన ఇటీవల వ్యాఖ్యానించారు.
Image result for ram gopal varma ka paul
ఇక మొన్న దర్శకుడు వర్మ, తన కాళ్ళు పట్టుకున్నదని పాల్ చెప్పడం, దానికి బదులుగా వర్మ, నిజానికి అయన కాళ్ళు పట్టుకుంది నిజమే అని, అయితే అయనను కింద పడేస్తే, తలకు దెబ్బ తగిలి అప్పుడైనా ఆయన బుర్ర సక్రమంగా పనిచేస్తుందని ఆలా చేసినట్లు చెప్పారు వర్మ. ఇక కాసేపటి క్రితం వర్మ, పాల్ ఒక మీడియా ఛానల్ లో పాట పాడుతున్న వీడియోని షేర్ చేసారు. అందులో పాల్ త్వరలో తాను ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటనలు చేయనున్నామని, అంతేకాక వేలాదిమంది ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు తనను గద్దెనెక్కించి సీఎం చేయడానికి సిద్ధంగా వున్నారని ఆ వీడియోలో చూడొచ్చు. ఇక ఆ వీడియో పెట్టిన వర్మ పక్కన నవ్వుతున్న ఎమోజిలను ఆడ్ చేయడంతో వీడియో మరింతగా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here