వినయ విధేయ రామ ట్రైలర్ పై వర్మ షాకింగ్ కామెంట్స్!

0
69
సంచలన దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ, సినిమాలు అలానే ప్రస్తుత రాజకీయాలకు, మరియు సమాజంలో జరిగే కొన్ని ఘటనలకు సంబంధించి తన స్పందనను ఎప్పటికపుడు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వుంటారు. అయితే ఇక్కడ ఒక్క గమ్మత్తైన విషయం ఏమిటంటే, మిగతా వారితో పోలిస్తే వర్మ తన అభిప్రాయాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా ముక్కుసూటిగా తెలియచేస్తూ వుంటారు. అయితే వాటివల్ల అయనను మెచ్చుకునేవారు కొందరైతే ఏక్కువ మంది మాత్రం ఆయనను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తుంటారు. ఇక నిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందిన వినయ విధేయ రామ ట్రైలర్ పై తన స్పందనను ట్విట్టర్ వేదికగా తెలియచేసారు వర్మ. గోల్డ్, డైమండ్ మిక్స్ చేస్తే వినయ విధేయ రామ ట్రైలర్ అంటూ అద్భుతమైన కాంప్లిమెంట్ ఇచ్చారు.
Related image
బోయపాటి గారు మీ సినిమా ట్రైలర్ వావ్ అనిపించేలా ఉంది. దీనిని హిందీలో కూడా రిలీజ్ చేయాలి ఎందుకంటే గోల్డ్(కేజీఎఫ్), డైమండ్స్ మిక్స్ చేస్తే ఈ ట్రైలర్. జంజీర్ తరువాత హిందీలో విడుదల కాబోయే రెండో చిత్రమిది కాబట్టి రామ్ చరణ్‌కి కూడా నా విషెస్ తెలియజేస్తున్నా. అతను సింపుల్‌గా మైండ్ బ్లోయింగ్‌గా కనిపిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసారు. అయితే వర్మ చేసిన ఈ కామెంట్స్ పై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను పొగడ్తల్లో ముంచెత్తుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ జోడి కడుతుండగా, ఒకప్పటి జీన్స్ సినిమా హీరో ప్రశాంత్ మరియు అల్లరి నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్, అలానే హీరోయిన్ స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here