‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ పై వర్మ సంచలన ప్రకటన… ఏంటంటే? 

0
79
ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ గారి బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రస్తుతం ప్రేక్షకాధరణతో ముందుకు సాగుతోంది. ఇకపోతే మరోవైపు సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంలోకి అయన రెండవ భార్య అయిన లక్ష్మి పార్వతి ఎంటర్ అయిన తరువాత పరిస్థితులపై తాను కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒక సినిమా రూపొందించబోతున్నట్లు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మొన్న అందులోని వెన్నుపోటు సాంగ్, అలానే శ్రీదేవి, జయసుధ, జయప్రద అనే మరొకపేటతో సినిమాపై హైప్ మరింత పెంచారని చెప్పాలి. ఇక నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం పోసుకోబోతుంది అంటూ తన ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు వర్మ. అయితే శుక్రవారం ఆర్జీవీ ఏం చేయబోతున్నారు, అసలేం ప్రకటన చేయబోతున్నారు, ఒకవేళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా లేక టీజర్ రిలీజ్ చేస్తారా అనేదానిపై సినీ ప్రియులు,
ఆర్జీవీ అభిమానులు, ఫాలోవర్స్ అంతా విపరీతమైన ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఆ ప్రకటన ఏంటో తెలియాలంటే నేటి సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూడాల్సిందే మరి. ఇక వర్మ ట్వీట్‌‌కు విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. మీ ప్రకటన కోసం ఎంతో ఆతృతతో వేచి చూస్తానమని కొందరు, మీ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ఇక సినిమాలో చంద్రబాబు, లక్ష్మీ పార్వతి పాత్రల్లో ఎవరు నటిస్తున్నారని ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తుండగా లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి నటిస్తున్నారు. మరి ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది మాత్రం తెలియాల్సివుంది. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ విపరీతంగా సినిమా వర్గాల్లో వైరల్ అవుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here