లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి ఎవరైనా అడ్డొస్తే ఖబద్దార్ : రామ్ గోపాల్ వర్మ

0
64
సంచలన సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్, మరియు ఆయన సతీమణి లక్ష్మి పార్వతి ల అంశాన్ని కథాంశంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గరనుండి మంచి సంచలనాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇక ఇటీవల ఆయన విడుదల చేసిన వెన్నుపోటు పాటపై టీడీపీ నాయకుల నుండి వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన మాత్రం తగ్గడం లేదు.
ఇక వారి బెదిరింపులకు  భయపడేది లేదని గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిన వర్మ, నేడు ఏకంగా మార్ఫింగ్ చేసి కట్టిపట్టుకుని వున్న ఒక ఫోటోని తన ట్విట్టర్ లో పోస్ట్  చేస్తూ, తాను తన సినిమా విషయమై ఎవరికీ భయపడను అని, ఇక  తన సినిమా జోలికి వస్తే ఎవరికైనా ఖబద్దార్ అంటూ కింద ఒక ట్యాగ్ లైన్ పోస్ట్ చేసారు. అయితే వర్మ చేసిన ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here