రామ్ చరణ్ గుట్టు బయటపెట్టిన కాజల్….. షాక్ లో మెగా కుటుంబం!|telugugaramchai

0
102
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ గురించి స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనం గా మారాయి. మ్యాటర్ ఏంటంటే, తేజ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్, ఆ తరువాత క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశి దర్శకత్వంలో చందమామ అనే సినిమాలో నటించి అందరి మన్ననలు అందుకుంది. అందులో కాజల్ నటనను మరియు అందాన్ని చూసిన దర్శకధీరు రాజమౌళి, ఎలాగైనా తాను చరణ్ తో తీయబోయే సినిమాలో ఆమెను తీసుకోవాలని భావించి, ఎట్టకేలకు చరణ్ తీసిన మగధీరలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఆ సినిమా అప్పట్లో ఒక చరిత్ర సృష్టించి ఆమెను స్టార్ హీరోయిన్ ని చేసింది. ఇక తరువాత కాజల్ చరణ్ తో మరొక్కసారి నాయక్ సినిమాలో కూడా నటించింది.
అయితే ప్రస్తుతం చరణ్, వినయ విధేయ రామ, మరియు ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి సినిమాల్లో నటిస్తుండగా, కాజల్ పారిస్ పారిస్ అనే సినిమాతో పాటు, లోక నాయకుడు కమల్ హాసన్, మరియు శంకర్ ల దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న భారతీయుడు 2 సినిమాలో కూడా ఛాన్స్ సంపాదించింది. అయితే ఆమె మాట్లాడుతూ, మగధీర సమయంలో తాను చూసినపుడు చరణ్ ఎలా వున్నాడో, ఇప్పుడు కూడా అదే విధంగా ఏ మాత్రం  భేషిజం లేకుండా వున్నాడని, ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్న చరణ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని అన్నారు. నిజానికి తనకు కెరీర్ పరంగా మంచి మంచి బ్రేక్ నిచ్చింది మాత్రం చరణ్ మరియు రాజమౌళిల మగధీర చిత్రమే అని, వారిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇక చరణ్ పై కాజల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here