పవన్ పై పోటీ చేస్తా : రాంగోపాల్ వర్మ|Telugugaramchai

0
36

ఎప్పుడు చూసిన ఎదో ఒక వివాదంలో ఉండే రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదాస్పద ట్వీట్ చేశారు . తాను భీమవరం నుండి పోటీ చేసి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ను ఓడిస్తా అన్నట్లుగా ఉంది వర్మ చేసిన ట్వీట్లో . అది కూడా బుధవారం అర్దరాత్రి 01:30 కి ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి . ఇటీవలే తాను దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిక్కుల్లో పది ఎలాగో అలా ఈ నెల 29 న విడుదలకు సిదంగా ఉంది . అయితే మీకు ఒక సందేహం రావొచ్చు అదేంటంటే ఎన్నికల నామినేషన్ తేదీ అయిపోయింది గదా అంటే దానికి కూడా వర్మ ఒక వివరణ ఇచ్చారు . అదేంటంటే డేట్ అయిపోయిందని నాకు తెలుసు కానీ నాకు స్పెషల్ పెర్మిషన్స్ ఉన్నాయ్ అందుకనే నేను పవన్ పై పోటీ చేస్తున్న అంటూ మరో సారి ఘాటైన ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు . ఏది ఏమైనా కుక్క తోక వంకర అన్నట్టు వర్మ బుద్ధి మాత్రం ఎప్పుడు మారాడు అంటూ నెటిజన్లు , పవన్ అభిమానులు ఘాటుగా రిప్లయ్ లు ఇస్తున్నారు . చూద్దాం వర్మ ఎలా పోటీ చేస్తాడో .  తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 29 న విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here