త్వరలో స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా పెళ్లి….. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు|

0
147
సినిమా హీరో, హీరోయిన్లలో కొందరు కాస్త వయసొచ్చాక పెళ్లి చేసుకుంటే, మరికొందరు మాత్రం ఒకింత యుక్త వయసులోనే ఒక ఇంటివారవుతుంటారు. కాస్త వయసొచ్చాక పెళ్లి చేసుకున్న వారిలో శ్రీదేవి, సావిత్రి, సౌందర్య, సిమ్రాన్, జయసుధ, రంభ, మీనా వంటివారు ఉంటే, ఇక యుక్త వయసులో పెళ్లి చేసుకున్న వారిలో షావుకారు జానకి, అంజలి దేవి, తులసి, అమలాపాల్, లక్ష్మి, వంటివారున్నారు. ఇకపోతే ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి పీక్స్ లో వున్న ఒక టాలీవుడ్ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఆమె మరెవరో కాదు, మనం సినిమాతో టాలీవడ్ కి ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా చేసిన తొలిసినిమా, ఊహలు గుసగుసతో మంచి హిట్ కొట్టిన రాశి ఖన్నా. అయితే రాశి ఖన్నా కెరీర్లో సుప్రీమ్, జై లవకుశ, అలానే ఇటీవల విడుదలైన తొలిప్రేమ వంటి విజయవంతమైన సినిమాలు వున్నాయి. ఇకపోతే రాశి ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
అంతేకాదు మరొక రెండు తమిళ సినిమాల్లో కూడా ఆమె నటిస్తున్నారు. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిందా రాశి, తనకు అప్పుడే ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం  మొదలెట్టారని, రాబోయే రెండేళ్లలోపే తనకు పెళ్లి జరిగే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చారు. అయితే తనకు కాబోయే భర్త తనని అర్ధం చేసుకునేవాడు అయి ఉండాలని, అంతేకాక మంచి, తెలివితేటలూ కూడా అతనిలో ఉండాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, నిజానికి ఆమె పెళ్ళికొడుకుని ఆల్రెడీ చూసుకుందని, ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు, మరియు స్వయంగా ఇటీవల కొన్ని వ్యాపారాలు పెట్టి విజయపథంలో దూసుకుపోతున్న యువ వ్యాపారవేత్తని రాశి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వినికిడి. ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్తలో నిజమెంతవరకు ఉందొ తెలియదుగాని, పలువురు నెటిజన్లు మాత్రం అప్పుడే ఆమెకు అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రాశి అంటూ విషెస్ చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here