రేషన్ తీసుకోవడానికి వచ్చిన ఈవిడని రేషన్ డీలర్ ఏ విధంగా హింసిస్తున్నాడో చూడండి!

0
106
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మరియు పేదవారికి కడుపునిండా మూడు పూటలా భోజనం చేయడానికి రేషన్ పధకాన్ని ప్రవేశపెట్టాయి. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరుగుతున్న ఘటనలు అక్కడక్కడా బయట పడ్డాయి కూడా. ఇకపోతే ఇటీవల ఆధార్ కార్డు ఆవశ్యకం తప్పనిసరి అయిన తరువాత వేలిముద్ర మరియు ఐరిస్ వంటి వాటి ద్వారా ప్రజలకు రేషన్ ఇచ్చే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇంతవరకు బాగానే వుంది, అయితే రేషన్ తీసుకునే వారిలో కొందరు వృద్ధుల వేలి ముద్రలు సరిగా పడకపోవడం వలన రేషన్ డీలర్ వద్ద మిషన్లు వారి ముద్రలను తిరస్కరిస్తున్నాయి. అయితే అటువంటి వారికి ప్రభుత్వం ప్రత్యామ్న్యాయంగా ఐరిస్ విధానాన్ని కూడా తీసుకువచ్చింది. దాని ద్వారా రేషన్ తీసుకునే వారి వేలిముద్రలు పడని పక్షంలో ఐరిస్ పద్దతిలో వారి కళ్ళను స్కాన్ చేసి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఒక పల్లెలో వృద్ధురాలు వేలిముద్రలు పడకపోవడంతో, ఐరిష్ పద్ధతి ద్వారా స్కాన్ చేసి రేషన్ ఇవ్వమని కోరగా రేషన్ డీలర్ కుదరదు అంటూ ఆమెపై విరుచుకుపడ్డాడు.
అయితే ఈ తాజా ఘటన ఖమ్మం జిల్లా, చుండ్రుగొండు మండలం, రావికంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. దాదాపు పది రోజుల నుండి ఒక రోజు తిని తినకుండా పస్తులుండి, ఎలాగో నెల మొదట్లో రేషన్ తీసుకోవడానికి వచ్చిన ఆమెపై రేషన్ డీలర్ విరుచుకుపడుతూ, అదేమిటి రేషన్ ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించిన వారితో, చూడండి సర్, నాకు సంబంధం లేదు, ఆవిడ వెలిముద్ర పడితేనే బియ్యం, రేషన్ సరుకులు, లేకపోతే ఇచ్చేది లేదు, అంటూ బెదిరిస్తున్నాడు. అంతేకాక తన వద్దనున్న ఐరిస్ మెషిన్ పని చేయడం లేదని, దానిపై అధికారులకు ఫిర్యాదు చేసానని, అయినప్పటికీ వారు రాకపోతే నేనేమి చేసేది అంటూ వితండవాదం చేస్తున్నాడు. ఇకపొతే ఈమెని మాత్రమే కాదు చాలా మందిని బెదిరించి అవసరం లేని వస్తువులను అమ్ముకుంటున్నాడు, ఇదేమిటి అని ఎవరైనా అడిగితే నాఇష్టం మీరెవరు అంటూ దౌర్జన్యం చేస్తూ, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాగా ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here